ప్రముఖ విప్లవ గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. అల్వాల్‌లోని గద్దర్ ఇంటికి వచ్చిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతకుముందు ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, గన్ పార్క్, ప్యాట్నీ, జేబీఎస్ మీదుగా అల్వాల్ వరకు గద్దర్ అంతిమ యాత్ర జరిగింది. అంతిమ యాత్రకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. గద్దర్‌ను చూసేందుకు అభిమానులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో గత కొద్ది రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
Also Read : Meera Jasmine: ‘చిగురాకు చాటు చిలక’లా మీరా జాస్మిన్.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?
అల్వాల్‌లోని మహాభోది స్కూల్‌లో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోపక్క, గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య విమలారావుకు లేఖ పంపించారు. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తూ ‘అశేష జనదారులు.. అనేక అశృధారలు.. గద్దరన్న సంపాదించుకున్న ఆస్తి. ధన్యజీవి… నిన్ను మరువదు ఈ గడ్డ’ అంటూ ట్వీట్ చేశారు.
Also Read : Canara Bank Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు..
