NTV Telugu Site icon

CM KCR : నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌.. మరో ముగ్గురు సీఎంలు

Kcr

Kcr

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని నేడు సీఎం కేసీఆర్‌ దర్శించుకోనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు సీఎంలు యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. రెండు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి కి ముఖ్యమంత్రులు వెళ్ళనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ముఖ్యమంత్రులు పినరయి విజయన్ , కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, యూపి మాజీ సీఎం అఖిలేష్,సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వెళ్లనున్నారు. 10.30 గంటలకు యాదాద్రికి నలుగురు సీఎంలు చేరుకుంటారు. అయితే.. 10.40 నుండి 11.30 గంటల వరకు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Also Read : BRS: బీఆర్ఎస్‌ తొలి సభకు సర్వం సిద్ధం.. గులాబీ పార్టీ బాస్‌ ప్రసంగంపై ఉత్కంఠ

ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రులు ఆలయాన్ని సందర్శించనున్నారు. అయితే.. ఈ రోజు ఖమ్మంలో నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొనేందుకు ఉదయం 11.40 గంటలకు యాదాద్రి నుంచి ఖమ్మం కు నలుగురు సీఎంలు వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే సీఎంల యాదాద్రి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. సీఎంల పర్యటన నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో భక్తులకు దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తారు. పినరయి విజయన్ , కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, యూపి మాజీ సీఎం అఖిలేష్,సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Also Read : Johar NTR: తాతకి నివాళీ అర్పించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్…