ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, వేములవాడ ఎమ్మెల్యే ప్రొ.చెన్నమనేని రమేష్‌బాబును రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యవహారాల సలహాదారుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నియమించారు. ఆయన ఐదేళ్లపాటు కేబినెట్ హోదాతో ఆ పదవిలో కొనసాగుతారు. డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో చేసిన పరిశోధన కోసం జర్మనీలోని ప్రతిష్టాత్మక హంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ నుండి పిహెచ్‌డి పట్టా అందుకున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకుంటున్నందున, పరిశోధన విద్యార్థిగా, ప్రొఫెసర్‌గా వ్యవసాయ ఆర్థిక రంగంలో తనకున్న అపార అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనున్నది. చెన్నమనేని రమేశ్ బాబకు ఉన్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల్లో బీఆర్ నుంచి బరిలో దిగనున్న అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించారు. అయితే.. రాష్ట్రంలో 119 సీట్లకు 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 7 స్థానాల్లోని అభ్యర్థులను మార్చారు. వారిలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఒకరు. పౌరసత్వం వివాదం కోర్టులో ఉండటంతో ఆయన స్థానంలో చెల్మడ లక్ష్మీనరసింహారావుకు టికెట్‌ను ఇచ్చారు. దీంతో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రమేష్‌బాబుకు ఈ పదవి అప్పగించినట్లు తెలుస్తోంది.
Also Read : AP-Telangana: వాతావరణంలో మార్పు.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు