Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana Assembly Elections 2023 Cm Kcr Speech In Brs Praja Ashirvada Sabha At Sangareddy

CM KCR: బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే..

Published Date :November 27, 2023 , 6:27 pm
By Mahesh Jakki
CM KCR: బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR: ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని సీఎం తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపారని.. 58 ఏళ్ళు ఎన్నో గోసలు పడ్డామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలన్నారు. ఆలోచించి ఓటు వేయాలి..ఓటే మనకు వజ్రాయుధమన్నారు సీఎం కేసీఆర్‌. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు డబ్బులు దుబారా చేస్తున్నాడని అంటున్నారని.. రైతు బంధు ఉండాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలని సీఎం ప్రజలకు సూచించారు. పీసీసీ చీఫ్ రేవంత్ 24 గంటల కరెంట్ వేస్ట్ అని మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతాయన్నారు.

Read Also: Bhupesh Baghel: కాంగ్రెస్తో కేసీఆర్కు భయం పట్టుకుంది…

మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చానన్న ఆయన.. రాహుల్ గాంధీ, రేవంత్, భట్టి విక్రమార్క ధరణి తీసేస్తాం అంటున్నారని.. ధరణి తీసేస్తే రైతు బంధు రాదు.. దళారుల రాజ్యం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని ఈ సందర్భంగా చెప్పారు. గవర్నర్ వల్ల కాస్త లేట్ అయ్యిందని.. అధికారంలోకి వచ్చాక అది కూడా చేస్తామన్నారు. సంగారెడ్డి నేను పుట్టిన గడ్డ..నా జిల్లా అని సీఎం తెలిపారు. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్‌ను ఓడగొట్టినా నేను ఏమి అనలేదని.. 24 గంటల త్రాగునీరు వచ్చే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. ఒక పార్టీ మత పిచ్చి పార్టీ..ఎంత సేపు మసీదులు తవ్వుదామా ప్రజల మధ్య లొల్లి పెట్టడమే వాళ్ళకి పని అంటూ సీఎం మండిపడ్డారు.

Read Also: KTR: ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయవద్దు..

సంగారెడ్డి హైదరాబాద్‌లో అంతర్భాగం అవుతుందని.. సంగారెడ్డికి మెట్రో వస్తే మీ దశ మారిపోతుందన్నారు. మొదటి దశలో ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తే…రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో వేయవచ్చన్నారు. కారుని గుద్దిన, నా ఓట్లు నేనే గుద్దుకున్న అన్న ఎమ్మెల్యే కావాలా అంటూ ప్రశ్నించారు. ఈ ఉద్యమ ద్రోహి మొదట బీఆర్‌ఎస్‌లోనే ఉండే అంటూ జగ్గారెడ్డిపై సీఎం అయ్యారు. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఎమ్మెల్యేగా లేకున్నా చింతా ప్రభాకర్ కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశాడన్నారు. 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదన్నారు. వంద ఉత్తరాలు రాసినా ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మార్చి తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Praja Ashirvada Sabha
  • cm kcr
  • sangareddy
  • Telangana Assembly Elections
  • telangana elections 2023

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions