Site icon NTV Telugu

BRS Praja Ashirvada Sabha at Alair: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం: సీఎం కేసీఆర్

Kcr

Kcr

BRS Praja Ashirvada Sabha at Alair: యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది.. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్‌ అని ఆనాడు అన్నారని, కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారని సీఎం గుర్తు చేశారు. సునీత నా బిడ్డలెక్క, ఆమె అడిగిన హామీలు నెరవేరుస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శివకుమార్‌ మనకు చెబుతున్నారని.. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

తన రాష్ట్రంలో ఐదు గంటల విద్యుత్ ఇవ్వలేని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా మనపై విమర్శలు చేస్తున్నాడని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. సమైక్య పాలకులు చెరువులను నిర్వీర్యం చేశారన్న సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జీవం పోశామన్నారు. అధికారంలో బీఆర్ఎస్ ఉంటేనే 24 గంటల విద్యుత్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండగగా మారిందన్నారు.

Also Read: Minister KTR: గ్రూప్ 1 వాయిదా పడేలా చేసింది విపక్ష పార్టీలే..

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుబంధు దుబారా అని మాజీ పీసీసీ అంటున్నారు. ధరణి మాత్రమే రైతు భూములకు భరోసా, శ్రీరామరక్ష. కాంగ్రెస్ అధికార కోసం ఎదురుచూస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం… పైరవీ కారుల హవా ఉంటుంది. రాహుల్ గాంధీకి వ్యవసాయం తెలియదు, ఎద్దు తెలియదు, నాగలి దున్నిండా. ఇక్కడి సన్నాసులు ప్రసంగాలు రాసిస్తే చదువుతున్నాడు.” అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Exit mobile version