NTV Telugu Site icon

CM KCR : నన్ను సీఎం చేసింది, ఇంత ఎత్తుకు పెంచింది సిద్దిపేట గడ్డే

Telaganga Cm Kcr

Telaganga Cm Kcr

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో స్పీడ్‌ పెంచింది. ఈ నేపథ్యంలోనే నేడు సిద్ధిపేటలో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. సిద్దిపేట ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అందరూ ఈ సభకే వచ్చారా అని అన్నారు. లెక్కపెట్టలేనంత మంది వచ్చారని, జనని జన్మ భూమిచ్చా స్వర్గదపి గరీయసి.. సిద్దిపేట పేరు విన్న, చూసిన నాకు కలిగే భవన ఇది అని ఆయన అన్నారు. నన్ను సీఎం చేసింది, ఇంత ఎత్తుకు పెంచింది సిద్దిపేట గడ్డేనని, నన్ను ఇంత వాడిని చేసినా నా మాతృభూమికి నమస్కారమన్నారు కేసీఆర్‌.

అంతేకాకుండా.. ‘ఈ గడ్డ రుణం నేము ఏమిచ్చినా తీర్చుకోలేను. తన పాత మిత్రులను గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ అమలు అవుతున్నది అంటే సిద్దిపేట వేదికగా నేను పెట్టిన పథకమే. చింతమడకలో నేను చిన్న వాణ్ణి ఉన్నప్పుడు నాకు తాగడానికి పాలు లేకపోతే ఓ ముదిరాజ్ తల్లి నాకు పాలు పట్టింది. ఆనాడు సాగు నీళ్లు లేని సిద్దిపేటకి మొండి ధైర్యంతో మీ దివేనలతో ముందుకు వెళ్లిన. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డనే. నేను ఎక్కడికి పోయినా కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని మొక్కి పోతా. సిద్దిపేట ఎలా అభివృద్ధి జరిగిందో చెబితే హరీష్ రావుని పొగిడినట్టు అవుతుంది. నేను ఉప ఎన్నిక కోసం కరీంనగర్ వెళ్తే ఆరడుగుల బులెట్ హరీష్ రావుని మీకు ఇచ్చి పోయిన. హరీష్ రావు మీద మన మంత్రులు జోక్ వేస్తారు.

ఏడన్న ఏమైనా కనిపిస్తే అది సిద్దిపేట లో పెట్టుకుంటాడు. సిద్దిపేట లో నేను ఉన్న హరీశ్ రావు చేసినంత అభివృద్ధి నేను చేయకపోదును. సిద్దిపేట కి ఒక్కటే తక్కువ ఉన్నది అది విమానం రావడమే. సిద్దిపేటలో లేనిదంటూ ఏమి లేదు. సిద్దిపేటకి పట్టుబట్టి హరీష్ రావు ఐటీ హబ్ తెచ్చాడు. తెలంగాణలోనే సిద్దిపేట కి ప్రత్యేక గౌరవం ఇచ్చారు. హరీష్ ని లక్ష మెజారిటీతో గెలిపించారు. ఈ సారి కూడా హరీష్ కే ఎక్కువ మెజారిటీ రావాలి. దళిత బంధు పథకానికి ప్రేరణ నాకు సిద్దిపేట లో జరిగిన ఘటనే ఉదాహరణ. ఈ దిక్కుమాలిన దరిద్రపు కాంగ్రెస్ దళితుల కోసం ఏమి చేయలేదు. దళితులకు విడతల వారిగా న్యాయం చేస్తాం. తెలంగాణ భారతదేశానికి తలమానికం అయితే సిద్దిపేట మాత్రం యావత్తు తెలంగాణకే తలమానికం. హరీష్ రావు బాగా పని చేస్తున్నాడు. మాల్లోక్కసారి హరీష్ రావుని మెజారిటీ దాటిపించి గెలిపించాలి.’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.