Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Kcr Speech At Pragati Nivedan Sabha In Manchirial

CM KCR Speech: ధరణి పోతే దళారీ రాజ్యం.. అదంతా దాని వల్లే..

Published Date :June 9, 2023 , 8:22 pm
By Mahesh Jakki
CM KCR Speech: ధరణి పోతే దళారీ రాజ్యం.. అదంతా దాని వల్లే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR Speech in Manchirial Public Meeting: సింగరేణిని కాంగ్రెస్‌ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని మండిపడ్డారు. వికలాంగుల ఫించను మరో వెయ్యి పెంచుతున్నామని సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రకటించారు. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో చక్కటి కలెక్టరేట్లు నిర్మించుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో అవి క్రమంగా సాధించుకుంటున్నామన్నారు. తాగు, సాగు నీటి సరఫరాలో ఇవాళ తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌, నిరంతర విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. విద్యుత్‌ తలసరి వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని సీఎం తెలిపారు. అలాగే వరి సాగులో పంజాబ్‌ను కూడా మించిపోయామన్న ఆయన.. యాసంగిలో దేశం మొత్తం కలిపి 94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు. యాసంగిలో తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. ఇప్పటికీ భారత్‌ వంట నూనెను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. వంట నూనె దిగుమతి తగ్గించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

Read Also: Big Breaking: దివ్యాంగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త.. పింఛన్‌ పెంపు

అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రెండవ విడత గొర్రెల పంపిణీని కూడా ప్రారంభించామని ఆయన వెల్లడించారు.గృహలక్ష్మీ పథకాన్ని కూడా ప్రారంభించుకుంటున్నామన్నారు. 250కిమీ గోదావరిని సస్యశ్యామలం చేసుకున్నామని.. సదాశివ మాస్టారు తలాపునా పారుతుంది గోదావరి అనే పాటను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సింగరేణిది 130 ఏళ్ల చరిత్ర అని.. వాస్తవంగా అది మన సొంత ఆస్తి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో 49 శాతం కేంద్రానికి అమ్మేసిందని.. బీజేపీ సింగరేణిని తాళం వేయాలని చూస్తోందని సీఎం ధ్వజమెత్తారు. బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో పవర్ కట్ ఉందన్న సీఎం.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు దర్జాగా కరెంట్ ఇస్తోందన్నారు. వడ్లు అమ్మితే ఐదారు రోజుల్లో పైసలు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి.. అదంతా ధరణి వల్లేనన్నారు. ధరణి వల్ల రిజిస్ట్రేషన్లు సులభంగా అవుతున్నాయన్నారు. అయిదు నిమిషాల్లో పట్టా చేతిలోకి వస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భూభాగంలో ఇంచు మించు 99 శాతం ధరణిలో ఉన్నాయన్నారు. రైతు భూమిని ఎవ్వరు మార్చలేరన్నారు.

కాంగ్రెస్ ధరణిని బంగళాఖాతంలో వేస్తానని అంటోందని.. ధరణిని వేస్తారా.. రైతులను వేస్తారా అంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు రాదన్న సీఎం.. బాధలు వస్తాయన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే పాత రాజ్యం వస్తుందన్నారు. పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్ని హత్యలు జరిగేవని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ధరణి పోతే దళారీ రాజ్యం వస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ధరణిని బంగాళాఖాతంలో కలిపి వేస్తా అన్న వాళ్లను గిరగిర తింపి బంగాళాఖాతంలో వేయాలన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM K. Chandrashekar Rao
  • CM KCR Speech
  • Manchirial Public Meeting
  • pensions
  • pensions for disabled

తాజావార్తలు

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..

  • MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!

  • బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions