NTV Telugu Site icon

CM KCR : కాంగ్రెస్, బీజేపీలు బీడీ కార్మికులను పట్టించుకోలేదు

Cm Kcr

Cm Kcr

నిజామాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించామన్నారు. నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చామని, కాంగ్రెస్ వస్తే భయంకర పరిస్థితులు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు బీడీ కార్మికులను పట్టించుకోలేదన్నారు సీఎం కేసీఆర్‌. 2014 తర్వాత చేరిన కొత్త బీడీ కార్మికులందరికి పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్ల ను 5016 కు పెంచుతామన్నారు సీఎం కేసీఆర్‌. ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుందన్నారు కేసీఆర్‌. మత కలహాలు సృష్టించిందని, హిందూ, ముస్లింలు సోదరభావంతో ఉన్నారన్నారు సీఎం కేసీఆర్‌. బీజేపీ మత పిచ్చితో మంటలు పెడుతోందన్నారు. వంద ఉత్తరాలు రాసినా కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ గాని నవోదయ పాఠశాల గానీ ఇవ్వలేదన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ వ్యతిరేకి అని, రెండు జాతీయ పార్టీ లు తెలంగాణ ను పట్టించుకోలేదన్నారు సీఎం కేసీఆర్‌. 2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఖాయమన్నారు. బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం కేసీఆర్‌.

Also Read : Nana Patekar: షూటింగ్ స్పాట్‌లో యువకుడిపై చేయి చేసుకున్న నటుడు.. వీడియో వైరల్

తెలంగాణ‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నాం. హిందూ, ముస్లిం, క్రైస్త‌వుల అనే తేడా లేకుండా అన్ని మ‌తాల ప్ర‌జ‌ల‌ను క‌లుపుకొని పోతున్నాం. అంద‌ర్నీ స‌మానంగా ఆద‌రిస్తున్నాం. ప్ర‌తి స్కీంలో అంద‌రూ భాగ‌స్వామ్యం అవుతున్నాం. అన్ని మ‌తాల వారిని స‌మానంగా చూస్తున్నాం. తెలంగాణ క‌ల్చ‌ర్ గంగా జ‌మునా తెహ‌జీబ్. హిందూ, ముస్లింలు అంద‌రూ సోద‌రుల్లా క‌లిసి ఉండి మొత్తం ప్ర‌పంచానికి ఉదాహ‌ర‌ణ‌గా ఉంటున్నాం. ప‌దేండ్ల‌లో ఒక్కసారంటే ఒక్క‌సారి కూడా క‌ర్ఫ్యూ లేదు, క‌ల్లోలం లేదు. బ్ర‌హ్మాండంగా శాంతియుతంగా ముందుకు పోతున్నాం. లా అండ్ ఆర్డ‌ర్ ప‌టిష్టంగా మెయింటెన్ చేస్తున్నాం. రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నాం.. బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యుల‌ర్ పార్టీ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Also Read : CM YS Jagan: మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి..