NTV Telugu Site icon

CM KCR : సమిష్టి కృషితోనే అద్భుత పురోగతి సాధించాం

Cm Kcr

Cm Kcr

నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ సీటులో వరుణ్‌ రెడ్డిని కూర్చండబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్‌ వద్ద పోలీస్‌ సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు.

Also Read : Nexon EV Max: టాటా నెక్సాన్ EV Max XZ+ Lux లాంచ్.. ధర ఎంతంటే..?

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు 25 కోట్లు చొప్పున కేటాయిస్తున్నామన్నారు. పది పరిక్ష ఫలితాల్లో రాష్ట్రం లోనే నిర్మల్ టాప్ రావడం గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతా అని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారని, రైతు బంధు, బీమా ఎలా వస్తుందన్నారు సీఎం కేసీఆర్. ధరణి ని బంగళాఖాతంలో కలుపు తామన్న వారినే బంగాళాఖాతంలో కలపాలన్నారు. ధరణి తీసి వేస్తే ఇవ్వన్నీ ఎలా వస్తాయని, మంచి నీళ్ళు పోయని నాటి దుర్మార్గుల పాలన మళ్లీ కావాలా అని ఆయన అన్నారు. ఏడాదికి 12 వేల కోట్లు ఖర్చు చేసి ఫ్రి కరెంట్ ఇస్తున్నామన్నారు. దళిత బంధు కు రామ్ రామ్ అనే వాళ్ల పాలన కావాలా అని ఆయన అన్నారు.

Also Read : Weather Update: తెలంగాణకు 4 రోజులు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

‘గ‌తంలో వ‌ర్షాకాలం వ‌చ్చిదంటే ఆదిలాబాద్ జిల్లాలో అంటురోగాల‌తో మ‌న‌షులు చ‌నిపోయేవారు. గ‌త నాలుగైదు ఏండ్ల నుంచి ఎక్క‌డా కూడా ఒక మ‌నిషి చావ‌డం లేదు. ప‌రిశుద్ధ‌మైన మంచినీళ్లు మిష‌న్ భ‌గీర‌థ ద్వారా అందుతున్నాయి. ఆ మ‌ర‌ణాల నుంచి బ‌య‌ట‌ప‌డ్డాం, అంటురోగాల నుంచి త‌ప్పించుకున్నాం. నాలుగు మెడిక‌ల్ కాలేజీలు అంటే నాలుగు సూప‌ర్ స్పెషాలిటీలు ఆస్ప‌త్రులు వ‌స్తున్నాయ‌. ఏదైనా జ‌బ్బు చేస్తే హైద‌రాబాద్ పోవాల్సిన అవ‌స‌రం లేదు. ‘ అని ఆయన అన్నారు.

Show comments