Nexon EV Max: భారతదేశంలో ఈవీ కార్ల మార్కెట్లను టాటా శాసిస్తోంది. టాటా నుంచి వచ్చిన నెక్సాన్ ఈవీ కార్ అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. ఏ ఇతర అటోమేకర్ కంపెనీ కూడా ఈవీ కార్ సెగ్మెంట్ లో టాటాకు పోటీగా నిలబడలేకపోతున్నారు. టాటా నెక్సాన్ భద్రతతో పాటు, ఇప్పుడున్న ఈవీ కార్లతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుండటం కూడా వినియోగదారులు దీన్ని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Read Also: Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ..
ప్రస్తుతం టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, ఈవీ మ్యాక్స్ వేరియంట్లలో లభిస్తోంది. ఇటీవల నెక్సాన్ EV Max డార్క్ ఎడిషన్ రిలీజ్ చేశారు. అయితే తాజాగా నెక్సాన్ EV Max XZ+ లక్స్ వేరియంట్ ని లాంచ్ చేశారు. దీని ధర రూ. 18.79 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతోంది. నెక్సాన్ EV Max XZ+ లక్స్ కొత్తగా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో రాబోతోంది. ఈ వేరియంట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
అప్‌గ్రేడ్ చేసిన ఎడిషన్‌లో హర్మాన్ నుంచి కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హై రిజల్యూషన్ హెచ్‌డి డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే. హెచ్‌డి రియర్ వ్యూ కెమెరా, ఆరు భాషల్లో వాయిస్ అసిస్టెంట్, ఆరు భాషల్లో 180+ వాయిస్ కమాండ్‌లు (ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు మరియు మరాఠీ)లను అందిస్తోంది.
Nexon EV ప్రైమ్ వేరియంట్ ధర
XM — రూ. 14.49 లక్షలు
XZ+ — రూ. 15.99 లక్షలు
XZ+ లక్స్— రూ. 16.99 లక్షలు
డార్క్ XZ+ — రూ. 16.19 లక్షలు
డార్క్ XZ+ — లక్స్ రూ. 17.19 లక్షలు
Nexon EV మాక్స్ వేరియంట్ ధర
XM — రూ. 16.49 లక్షలు
XM — 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ రూ. 16.99 లక్షలు
XZ+ — రూ. 17.49 లక్షలు
XZ+ — 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ రూ. 17.99 లక్షలు
XZ+ — లక్స్ రూ. 18.79 లక్షలు
XZ+ — లక్స్ 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ రూ. 19.29 లక్షలు
డార్క్ XZ+ — లక్స్ రూ. 19.04 లక్షలు
డార్క్ XZ+ లక్స్ — 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ రూ. 19.54 లక్షలు