Site icon NTV Telugu

CM KCR : తెలంగాణ సంక్షేమ పథకాలు కరీంనగర్ వేదికగా ప్రకటించుకున్నాం

Kcr

Kcr

కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రకి ఈ‌ ఎస్సారార్ కళాశాల ‌కి ఒక ప్రత్యేకత ఉందన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు కరీంనగర్ వేదికగా ప్రకటించుకున్నామని, కాంగ్రెస్ పార్టీ డోకాబాజ్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. 1969 లో నాలుగు వందల మందిని పొట్టన పెట్టుకున్నారని, కేసీఆర్ చచ్చుడో అని అమరణ నిరాహార దీక్షకి కూడా ఇక్కడనే బీజం అయ్యిందన్నారు సీఎం కేసీఆర్‌. బీఆర్ఎస్ పాలనలో తలసరి‌ అదాయం ఇండియాలో నంబర్ వన్ లో‌ ఉన్నామని, విద్యుత్ వినియోగం లో మనమే నంబర్ వన్‌ అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

Also Read : HIV- Hepatitis: హాస్పిటల్ నిర్వాకం.. 400కి పైగా రోగులకు HIV, హెపటైటిస్ ప్రమాదం..?

అంతేకాకుండా.. ‘ ఎలక్షన్ వచ్చిందంటే పాల్త్ వాగ్దానాలు ఇస్తారు. పోటిలో ఉన్న అభ్యర్థుల గుణగణాలు గుర్తించాలి. తెలంగాణ వచ్చిననాడు రాష్ట్రంలో సాగునిరు,త్రాగునీరు లేదు. భారత దేశ చరిత్ర లోనే వందల రూపాయల‌ పింఛన్ ని వేల రూపాయలకి చేసినాం. ధరణి పొర్టల్ భూముల పంచాయతి లు తగ్గినవి. కాంగ్రెస్ పార్టీ ధరణి బంగాళాఖాతం లో వేస్తే రైతు బంధు వస్తదా.. కరీంనగర్ ని‌ నగరం అని పిలవాలనిపిస్తుంది. కరీంనగర్ ఇప్పుడు అద్దంలాగా తయ్యారు అయ్యింది. మానేరు రివర్ ప్రంట్ పూర్తి అయ్యితే పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చెందుతది. ఇరవై నాలుగు గంటలపాటు నీటి సరఫరా అయ్యే ప్రణాళికలు రూపొందించాం. ఎవ్వడూ ఎన్ని మొత్తుకున్న బీఆర్ఎస్ వర్నమెంట్ వస్తది. బీజేపీకి మతపిచ్చి తప్ప వేరేది తెల్వది. వంద ఉత్తరాలు రాస్తే మెడికల్ కాలేజ్ ‌ఇవ్వలేదు,మేమే నాలుగు గవర్నమెంట్ కాలేజిలు ఇచ్చాం. తెలంగాణ లో జిల్లాకొకటి మెడికల్ కళాశాల లు ఏర్పాటు చేసుకున్నాం. ఒక్క మెడికల్ కాలేజ్, నవోదయ పాఠశాల లు ఇవ్వని బిఅర్ఎస్ ఎందుకు ఓటు వేయాలి. ఇక్కడి ఎంపికి మసీదులు తవ్వుదామా,గుడులు తవ్వుదామా అనే ధ్యాసనే. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేది ఎవరో చూడండి.. విధ్వంసం కావాలా విద్వేషం కావాలా ఆలోచించండి. కర్రు కాల్చి బీజేపీకి వాత పెట్టండి.’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Karnataka: “ముస్లిం స్పీకర్‌”కి బీజేపీ ‘నమస్కారం సార్’ అని చెప్పాలి.. కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Exit mobile version