బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేడు తెలంగాణలో జరుగనున్న ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతేకాకుండా.. 51మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్‌ను అందజేశారు. అయితే.. ఈ క్రమంలోనే నేడు హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. గత ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ప్రచారం చేశాం… మూడింట రెండువంతుల మెజారిటీతో విజయాలు సాధించామన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కింద తెలంగాణ పరిస్థితి కొత్త కుండలో ఈగ జొచ్చినట్టు ఉంది… అడుగడుగునా సమస్యలే ఉన్నాయన్నారు. అలాంటి తెలంగాణను ఈరోజు దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయామని కేసీఆర్ అన్నారు. కేంద్ర సహకారం లేకపోయినా, ప్రతిపక్షాల కుట్రలు సాగినా అద్భుతాలు సాధించామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Ajith: అజిత్ ఫేవరేట్ ఆర్ట్ డైరెక్టర్.. గుండెపోటుతో మృతి
అంతేకాకుండా..’60 ఏండ్ల కింద దళిత బంధు ఉంటే పేదరికం ఉంటుందా… పెన్షన్ 5 వేలు చేస్తాం… వచ్చే ఏడు 3 వేలకు పెంచి.. ఐదేళ్ల నాటికి 5 వేలకు పెన్షన్ పెంచుతాం. రైతు బంధు 16 వేలకు పెంచుతున్నాం.. హుస్నాబాద్ ఒకప్పుడు కరువు కాటకాల పరిస్థితి.. ఇప్పుడు సమృద్ధిగా జలాలు వస్తున్నాయి. నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, గౌరవెల్లి ప్రాజెక్టు వల్ల ఇది సాధ్యమైంది.. మిషన్ భగీరద లాంటి ప్రాజెక్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. కొత్తకొండ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం… నేను చిన్నతనం నుంచి కొత్తకొండ వస్తూనే ఉన్నా.. హుస్నాబాద్ గెలుపు రేపు 95 నుంచి 105 సీట్లు సాధించడానికి నాంది కావాలి..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.