NTV Telugu Site icon

CM KCR: కాంగ్రెస్ సరిగ్గా పాలిస్తే దేశం దుస్థితి ఇలా ఉండేదా?

Manthani

Manthani

CM KCR: బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంథనిలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో రాజకీయ పరిణతి పెరగాలి.. ప్రజస్వామ్య పరిణతి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఆయా పార్టీల ఆలోచనా విధానాన్ని, వైఖరిని చూసి ఓటేయాలని ప్రజలను కోరారు.1956 వరకు ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సేనని.. 52 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలు నరకం చూశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ సరిగ్గా పాలిస్తే దేశం దుస్థితి ఇలా ఉండేదా అంటూ ప్రశ్నించారు.

Also Read: CM KCR: సింగరేణిని ముంచింది కాంగ్రెస్సే.. ప్రజలు విచక్షణతో ఓటేయాలి..

పుట్టమధు మంథనికి ఎంత చేయాలో అంత చేశారు.. మీరే మధు పని చేశారన్నారు. రేవంత్ 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడని.. కర్ణాటకలో ఇట్లనే చేశారు… 5 గంటల కరెంట్ ఇస్తున్నారని సీఎం అన్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రే ఈ విషయాన్ని ఒప్పుకున్నారన్నారు. శ్రీధర్ బాబు కుటుంబం 6 సార్లు గెలిచారని… పుట్టమధు ఎందుకు గెలవకూడదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చున్న వారికి ఓటేస్తే లాభం లేదు.. లోకల్‌గా వుండే పుట్టమధును గెలిపించాలని కోరారు. బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది… వినియోగించుకోవాలన్నారు. మధుని గెలిపిస్తే ఒక రోజంతా మంథనిలో ఉండి.. వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ రైతు బంధు వద్దంటున్నారు.. రాహుల్ కి ఎద్దు ఉన్నదా ఎవుసం ఉందా అంటూ ప్రశ్నించారు.

Also Read: Chandrababu: చంద్రబాబు కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి

మహారాష్ట్రలో నీటి తీరువా వసూల్ చేస్తున్నారు.. తెలంగాణలో శాశ్వతంగా రద్దు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. మాకు హైకమాండ్ ఢిల్లీలో ఉండదు.. మా హైకమాండ్ మీరేనని ప్రజలను ఉద్దేశించి అన్నారు. కొన్ని పార్టీలకు ఢిల్లీలో స్విచ్ వేస్తే ఇక్కడ వెలుగుతుందన్నారు. వాళ్లకు చిత్తశుద్ధి లేదు… ఒక్కో పార్టీలో డజన్ల ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు. నాయకులు అమ్ముడు పోతే ప్రజలు చూసుకుంటారని ఈ సందర్భంగా సీఎం హెచ్చరించారు. కచ్చితంగా బీఆర్ఎస్ సర్కార్ వస్తది… మంథనిలో మధుని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.