NTV Telugu Site icon

CM KCR: 50 ఏండ్లు తెలంగాణను అరిగోస పెట్టింది కాంగ్రెస్ పాలన కాదా..

Kcr Jagitial

Kcr Jagitial

సీఎం కేసీఆర్ జగిత్యాల ప్రజాశీర్వదా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆగం కావద్దు నిజానిజాలు తెలుసుకొని ఓటు వేయాలన్నారు. జగిత్యాలలో ఎవరు గెలుస్తారో ఆ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటుందని తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో, 10 ఏండ్ల BRS పాలన ఎలా ఉందో గమనించాలని కోరారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుండి జీవన్ రెడ్డి సమైక్య ఆంధ్రుల తరపున తన పై పోటీ చేశారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణను ఆంధ్ర నాయకుల కంటే ఎక్కువ నష్టం చేసింది తెలివి లేని తెలంగాణ కాంగ్రెస్ నాయకులని మండిపడ్డారు. 50 ఏండ్లు తెలంగాణను అరిగోస పెట్టింది కాంగ్రెస్ పాలన కాదా అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట.. ఎందుకు ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ రాజ్యంలో.. జగిత్యాలలో అపక్రటిత పరిస్థితులు ఏర్పడ్డాయని కేసీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నలుపు, తెలుపు ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు.

Read Also: Digvijay Singh: కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు..

కులం, మతం మీద ఓట్లు పడద్దని సీఎం కేసీఆర్ అక్కడి ప్రజలకు తెలిపారు. ఈ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్ ను రూ.5000 వరకు దశల వారీగా పెంచుతామన్నారు. అంతేకాకుండా.. రైతుబంధుతో రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అని అంటున్నాడని.. 24 గంటల విద్యుత్ చాలు అంటూ బాధ్యతరహిత్యంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ రైతులకు ఉరే అని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఎద్దు ఎవసం తెల్వదు.. ధరణిని తీసివేస్తే రైతు బంధు ఎలా రావాలి.. రైతు బంధు తీసేస్తే రైతుల పరిస్థితి గోల్మల్ అవుతుందని కేసీఆర్ అన్నారు.

Read Also: Varun Tej: కొత్త భార్యపై దుష్ప్రచారం.. అందరి నోళ్లు మూయించిన వరుణ్ తేజ్

జీవన్ రెడ్డి ఏమైనా అంటే స్టేట్ పాలసీ అంటాడు.. ఇంట్లో పంటాడని అంటాడని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల, రైతులకు కాంగ్రెస్ శనిపాతంలా దాపరించిందని అన్నారు. సంజయ్ ప్రజాసేవలో ఉన్న వ్యక్తి.. అతన్ని ఆదరించాలని తెలిపారు. జగిత్యాల ఇంచుమించు కరీంనగర్ పట్టణంలా అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వరద కాలువకు కనీసం తూములైన పెట్టారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని.. ఎవరు ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు అని అన్నారు. జగిత్యాలలో 100 శాతం చెప్తున్నా మళ్ళీ భారీ మెజారిటీతో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.