మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో మంచి పేరు కలిగిన వ్యక్తి అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కేసీఆర్ నివాళులు ఆర్పించారు. సాఠే చిత్రపటంతో పాటు డాక్టర్ బీఆర్. అంబేడ్కర్, మహాత్మా జ్యోతి బాఫూలేతో పాటు పలువురు మహానీయులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులలు ఆర్పించారు. అలాగే వాటేగావ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా తెలంగాణ సీఎం పాల్గొన్నారు.
Read Also: Trending news: అయ్ బాబోయ్ ఎంత పొడుగో.. ట్రెండ్ అవుతున్న ఈ జంట
అంతకు ముందు బేగంపేట విమానాశ్రయం నుంచి కొల్హాపూర్ కు చేరుకుని అక్కడ మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు కేసీఆర్‌ను ఆశీర్వదించి.. తీర్థ ప్రసాధాలు అందించారు. కొల్హాపూర్ చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ స్లోగన్స్ ఇస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సాఠేకు నివాళులు ఆర్పించిన కేసీఆర్ అక్కడ నుంచి ఇస్లాపూర్‌లోని రఘునాథ్ దాదాపాటిల్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. కొల్హాపూర్‌లోని సాధు మహారాజ్ సమాధి దగ్గర నివాళి అర్పించారు. మరికాసేపట్లో నాగాల పార్క్‌లోని పూధరి న్యూస్‌పేపర్ యజమాని ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇక కేసీఆర్ తిరిగి సాయంత్రం 5.40 గంటలకు కొల్హాపూర్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
Read Also: Suprem Court: మణిపూర్ డీజీపీకి సుప్రీం నోటీసులు.. సోమవారానికి కేసు వాయిదా
దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే భరతమాత ముద్దు బిడ్డ అని కేసీఆర్ ప్రశంసించారు. అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలని, ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నాభావు సాఠే గొప్పతనాన్ని గుర్తించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.