NTV Telugu Site icon

CM KCR: ఈసారి గెలిచిన తర్వాత రేషన్ పై అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తాం..

Kcr Kanapur

Kcr Kanapur

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వదా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయంటే అందరూ వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు.. ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేయాలని తెలిపారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 58 సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అందుకోసం ప్రజలందరూ ఆలోచించాలన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో మీకు మీరు ఆలోచన చేసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సంపద పెంచామని…మళ్ళీ తాము గెలిస్తే 5 వేల పెన్షన్ అందిస్తామని చెప్పారు.

PM Modi: “విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం అవసరమా.?” మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ..

కల్యాణ లక్ష్మీ, అమ్మఒడి వంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ.. ఇంకా పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఖానాపూర్ నియోజక వర్గంలో 7300 పోడు భూమి పట్టాలు ఇస్తూ.. వారందరికీ రైతు భరోసా ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ సారి గెలిచిన తర్వాత రేషన్ పై అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భారత దేశంలో మొదటి సారి రైతు బంధును పుట్టించిందే తాను అని సీఎం కేసీఆర్ అన్నారు.

PM Modi: సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం

మరోవైపు కాంగ్రెసోళ్లు.. రైతు బంధు వద్దని అంటున్నారు… రైతు బంధు కావాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటలు కరెంట్ కావాలంటే జాన్సన్ నాయక్ ను గెలిపించండని అక్కడి జనాలను ముఖ్యమంత్రి కోరారు. అందరు మీ గ్రామాలకు వెళ్లి చర్చ పెట్టండి.. అన్ని కులంకుశంగా చర్చించి నిర్ణయం తీసుకోండి… ఎవరు అభివృద్ధి చేశారు.. ఎవరు చేస్తారని మీరే నిర్ణయం తీసుకోండి అని అన్నారు. జాన్సన్ నాయక్ మా ఇంటి బిడ్డ లెక్క గెలిపించండి.. అభివృద్ధి చేస్తాడని సీఎం కేసీఆర్ చెప్పారు.