CM KCR: యూపీఏ చట్టం కింద ప్రొఫెసర్ హరగోపాల్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎంవో నుంచి తెలంగాణ పోలీసు శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మందిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తోంది. హరగోపాల్ సహా పలువురు మేధావులపై ఉపా చట్టం కింద నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
Read also: Stunning Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న బ్రాడ్ కర్రీ
ములుగు జిల్లాలోని తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో 19 ఆగస్టు 2022న ఒక కేసు నమోదైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UPA), ఆయుధ చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 10 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. హరగోపాల్‌తో పాటు 152 మంది కార్యకర్తలు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..? పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని పోలీసులు రెండు నెలల కిందటే అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతనిపై మరిన్ని కేసులు ఉన్నాయని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టుకు సమాచారం అందించారు. అన్ని కేసుల వివరాలను పోలీసులకు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు నేతృత్వంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం, పార్టీకి నిధులు సమకూర్చడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలో చేర్చుకోవడం వంటి అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. నిందితుల్లో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ (ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే జస్టిస్ సురేశ్ మరణించారు), ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, సిక్దు ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
Read also: Kedarnath Disaster: కేదార్‌నాథ్ దుర్ఘటనకు పదేళ్లు.. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న ప్రజలు
మావోయిస్టు పార్టీకి చెందిన కొందరు సమావేశమవుతున్నారనే సమాచారంతో తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామంలో పోలీసులు ఉదయం కూంబింగ్ నిర్వహించారు. పోలీసులు రావడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించి విప్లవ సాహిత్యాన్ని, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారుల పేర్లు ఉండడంతో వారిని నిందితులుగా చేర్చారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులను హతమార్చేందుకు మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర పన్నారన్నారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు నేతృత్వంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం, పార్టీకి నిధులు సమకూర్చడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలో చేర్చుకోవడం వంటి అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. నిందితుల్లో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ (ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే జస్టిస్ సురేశ్ మృతి), ప్రొఫెసర్ పద్మా జాషా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, సుక్దు ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు ఎత్తేయండి.. డీజీపీకి కేసీఆర్ ఆదేశాలు