క్యూట్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా .. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా ఆమె కొనసాగుతూ ఉంది అంటే ఈమెకు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో అర్ధం అవుతుంది.ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది త్రిష ఈమె పలువురు స్టార్ హీరోలు సరసన అవకాశాలు కూడా దక్కించుకుంది.ఇలాంటి సమయంలో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది.ఆ నిర్ణయం వల్ల ఆమె కెరియర్ కు ఇబ్బంది కలుగుతుందేమోనని అభిమానులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు..అస్సలు ఆమె తీసుకున్న డెసిషన్ ఏమిటంటే తాజాగా త్రిష, చిరంజీవికి జోడిగా ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సిద్దు జొన్నలగడ్డకు తల్లిగా త్రిష నటించడానికి అంగీకరించింది అంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన తమిళ్ కామెడీ సినిమా బ్రో డాడీని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారని సమాచారం.
ఒరిజినల్ సినిమా లో మోహన్ లాల్ మరియు మీనా పృధ్విరాజ్ కు తల్లిదండ్రులుగా కనిపించగా అందులో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్గా అయితే నటించింది. తెలుగు వర్షన్ లో చిరంజీవి మరియు త్రిష తల్లిదండ్రుల పాత్రలను పోషిస్తారని వారి కొడుకు పాత్రలో డిజె టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ నటిస్తుండగా సిద్దూ కి జోడి గా శ్రీలీల నటించే అవకాశం ఉందని సినిమా ఇండస్ట్రీలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే పోన్నియిన్ సెల్వన్ సినిమాలో లీడ్ రోల్ పోషించి పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.త్రిష ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ కు తల్లిగా నటించడానికి అంగీకరించడం తో అందరూ షాక్ అవుతున్నారు.అందుకు ఆమె నిజంగానే అంగీకరించినట్లయితే ఆమె కు పారితోషకం కూడా ఎక్కువగానే అందించడం జరుగుతుంది.కానీ తల్లి పాత్రల వల్ల తన కెరీర్ కు ఇబ్బంది కలుగుతుందేమో అని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.