తెలంగాణ ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ పార్టీ నేతలు జోరు పెంచుతున్నారు. వీలైనంత వరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా షెడ్యూల్ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా.. సీఎం కేసీఆర్ తాండూరులో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి వారికి ఇచ్చి యుద్ధం మనల్ని చేయమనడం సమంజసం కాదు.. ప్రజలు ఆలోచించండని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తాండూర్ ప్రజలు కాగ్న వాగులో ఉన్న నీటిని తోడుకొని తాగేవారని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికి భగీరథ నీటిని అందించామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Rivaba Jadeja: “భారత ఆటగాళ్లకు ప్రధాని మోడీ ఓదార్పు”.. కీలక వ్యాఖ్యలు చేసిన రవీంద్రా జడేజా భార్య
రైతుబంధు, 24 గంటలు విద్యుత్ ఉండాలంటే పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించాలని సీఎం ప్రజలను కోరారు. పార్టీల పనితీరును గమనించి ప్రజలు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని భూమాత చేస్తా అని అంటున్నారు… భూమాత కాదు భూమేత అవుతాదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటే దళారీ, పైరవీకారుల రాజ్యమని ఆరోపించారు.
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం చేరువలో విరాట్ కోహ్లీ
తాండూర్ ప్రజలు కర్ణాటక బోర్డర్ లో ఉంటున్నారు.. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన ఉంది.. అక్కడ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఎంత సమయం ఇస్తున్నారో… ఇక్కడ ప్రభుత్వం ఎంత సమయం వస్తుందో ప్రజలు గమనించాలని సీఎం తెలిపారు. మంత్రి మహేందర్ రెడ్డి ఆశీస్సులు పైలెట్ రోహిత్ రెడ్డికి మెండుగా ఉన్నాయని.. అధికారంలోకి వచ్చిన తర్వాత రోహిత్ రెడ్డి కోరిన పనులన్నీ చేసి చూపిస్తామని పేర్కొన్నారు. బంజారా బిడ్డల కోసం బంజారాహిల్స్ లో బంజారా భవనం వారికి గౌరవ చిహ్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని సీఎం తెలిపారు. సేవాలాల్ సేన బీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారీ సంఖ్యలో సభకు ప్రజలు రావడంతో ఇక్కడ గులాబీ జెండా ఎగిరిపోయిందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.