సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకున్నారు. అయితే.. 25 ఏళ్ల తరువాత తొలిసారి సీఎం హోదాలో కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్ విచ్చేశారు. అయితే.. కొండగట్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. కొండగట్టు ఆలయంలోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
Also Read : Meera Jasmine: ఇలా అప్పట్లో కనిపించి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదేమో…
అంజన్న దర్శనం తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు. సుమారు మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Also Read : South Central Railway GM : ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.. ప్రయాణికులు సురక్షితం