హైదరాబాద్ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో హరేకృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామని చెప్పారు. ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 25 కోట్లు ఇస్తామని ప్రకటించారు. నార్సింగిలో 200 కోట్ల రూపాయలతో ఆరు ఎకరాల విశాలమైన స్థలంలో 400 అడుగుల ఎత్తున దేవాలయం నిర్మించనున్నారు. శ్రీ రాధాకృష్ణ మరియు శ్రీ శ్రీనివాస గోవిందుల దేవాలయాలతో పాటు సువిశాల గోష్పాద క్షేత్రంలో ఇది నిర్మితం కానుంది.
Also Read : Telangana First Year Intermediate Results 2023
ఎక కాలంలో 1500 మంది భక్తులు రాధాకృష్ణుల్ని దర్శించుకునేలా ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. ఆలయంతో పాటు 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో తిరుమల శ్రీవారి ఆలయ తరహాలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తారు. తెలంగాణ చరిత్ర, వైభవానికి అద్దం పట్టేలా కాకతీయ నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఆలయంలో ఒకేసారి 500 మందికి అన్నదానం జరిగేలా, లైబ్రరీ, కల్యాణ కట్ట, ఆడిటోరియం, కల్యాణ మండపం, ఐ మాక్స్ థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, లెక్చర్ హాల్, క్వీన్ కాంప్లెక్స్, వంద గదులతో గెస్ట్ హౌస్, ఆశ్రమ నిర్మాణం జరగనుంది. భారీ స్థాయిలో నిర్మించబోతున్న ఈ ఆలయం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.