సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏక మొత్తంలో ఒకేసారి ఏరియర్స్ సింగరేణిలో ఉద్యోగులకు, కార్మికులకు చెల్లించేలా సింగరేణి సర్క్యులర్ విడుదల చేసింది. ఈనెల 21న ఉద్యోగులందరికీ చెల్లింపు చేయనున్నట్లు సర్క్యులర్ లో సింగరేణి యాజమాన్యం పేర్కొంది. దీంతో.. ఒక్కో కార్మికుడికి దాదాపుగా 4 లక్షల మేర ఏరియర్స్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 వేల ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. సీఎం కేసీఆర్, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత ప్రత్యేకత చొరవతో నాయకుల కృషితో ఒకేసారి కార్మికులకు ఎరియర్స్ బకాయిలు అందనున్నాయి. 23 నెలల ఏరియర్స్ చెల్లింపు లో 23 నెలల సీఎంపీఎఫ్ షేర్, ఇంకామ్ టాక్స్ వాటి బకాయిలు తీసుకొని మిగతా బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే.. ఒకేసారి ఏరియర్స్ విడుదల చేయడంపై ఉద్యోగులు, కార్మిక నాయకుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Priyanka Tour: హిమాచల్ ప్రదేశ్లో ప్రియాంక గాంధీ పర్యటన.. వరద బాధితులకు పరామర్శ
ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)లో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబరు 28న జరగనున్నాయి. అక్టోబరు 7న నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 10న కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 22న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
Also Read : IND vs SL: రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. నిరాశపరిచిన కోహ్లీ
గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎన్నికల నిర్వహణపై నిన్న హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్ కమిషనర్‌తో జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు ఒక అవగాహనకు వచ్చాయి. సెప్టెంబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించేందుకు కార్మిక శాఖ అంగీకరించింది.
సింగరేణి అధికారులు ఈనెల 21న కార్మికులకు వేజ్ బోర్డు బకాయిలు చెల్లిస్తున్నారని కొన్ని సంఘాలు తెలిపాయి.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వివిధ కారణాలతో ఇప్పటి వరకు మూడుసార్లు వాయిదా పడ్డాయి. చివరి ఎన్నికలు అక్టోబర్, 2017లో జరిగాయి. బీఆర్‌ఎస్‌కి అనుబంధంగా ఎన్నికైన బొగ్గుగాని కార్మిక సంఘం (TBGKS) పదవీకాలం 2021లో ముగిసింది.