CM KCR : కొత్త సెక్రటేరియట్‌లో సీఎం కేసీఆర్ తొలి సమీక్షా దానిపైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతనంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కూలంకషంగా చర్చించారు. ఇందులో భాగంగా జూలై వరకు కరివెన జలాశయంకు నీళ్ళు తరలించాలని, ఆగష్టు వరకు ఉద్దండపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఇందులో నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాటి సంబంధిత పంప్ హౌజ్ లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఒక రిజర్వారయ్ నుంచి మరొక రిజర్వాయర్ కు నీటిని తరలించే ‘కన్వేయర్ సిస్టమ్’ లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ సూచించారు.
Also Read : TSRJC : ఈ నెల 6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2023.. నేటి నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్
Also Read
పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతి పై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో..ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు… మంత్రులు నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి; ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి; ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి; ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, కాలె యాదయ్య, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, అంజయ్య యాదవ్, ప్రకాశ్ గౌడ్, మహేష్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి; తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్;
Also Read : Harish Rao : బీజేపీ పాలిత రాష్ట్రాలలో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతోంది
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణా రావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఈఎన్సీ మురళీధర్ రావు, అడ్వైజర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెంటారెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి; సీఈ లు హమీద్ ఖాన్, ధర్మా, ఎస్ఈ లు రంగారెడ్డి, శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డి, చక్రధర్ , ఎఎస్ఎన్ రెడ్డి, ట్రాన్స్ కో డైరక్టర్ సూర్య ప్రకాశ్, డిఈ పిఆర్ఎల్ఐఎస్ సయ్యద్ మోయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!