CM KCR Election Campaign: నేడు నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసిఆర్ పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న వేళ గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం మరింత స్పీడ్ పెంచారు. నేడు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు సపోర్టుగా గులాబీ అధినేత ప్రచారం చేయనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఈ సభా వేదికల్లో కేసీఆర్.. ప్రజలకు ఓటు హక్కును తెలియజేస్తున్నారు. మరోవైపు తొమ్మిదన్నరేళ్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి వివరిస్తున్నారు.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: Dhruva Nakshathram postponed: విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ సినిమా మళ్లీ వాయిదా
Also Read
ఇక, ఇదే సమయంలో రేపు (శనివారం) జరిగే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. టీఎస్ఐఐసీఛైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి తలసాని సభా వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 82 సభల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తూనే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే వాటిని సీఎం ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇక, మరో వైపు విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. వారి వైఖరిని ఖండిస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!