Site icon NTV Telugu

Harish Rao : మెడికల్‌ విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

Cm Kcr

Cm Kcr

తెలంగాణలో వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య విద్యలో చేరాలనుకునే విద్యార్థులకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం దుర్గా అష్టమి, సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాల కోసం మొత్తం 2,200 అదనపు మెడికల్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

“మేము ఈ సంవత్సరం నుండి 8 కొత్త మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లను ప్రారంభిస్తాము, దీంతో మరో 1200 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ మెడికల్ సీట్లలో 85 శాతం రిజర్వేషన్ ద్వారా 1067 అదనపు ఎంబీబీఎస్ సీట్లతో కలిపి ఈ ఏడాది నుంచి 2,200 మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నాము. తెలంగాణలోని ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అందిస్తున్న దసరా కానుక ఇది’’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు వెల్లడించారు.

 

Exit mobile version