Munugode Mla: కేసీఆర్ ని కలిసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల..ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కూసుకుంట్ల సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అవకాశమిచ్చి తన విజయానికి కారణమైనందుకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ., సిఎం కెసిఆర్ గారికి కృతజ్జతలు తెలిపారు.
Read Also: Gadwal Nude Video calls Case: గద్వాల్ న్యూడ్ వీడియో కాల్స్ కేసులో ట్విస్ట్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ సందర్భంగా కూసుకుంట్ల కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్ శాలువాతో ఆయనను సత్కరించి దీవించారు.మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని సిఎం పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు పూనుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జి. జగదీశ్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు పలుపురు పార్టీ నేతలు సిఎం కెసిఆర్ ను కలిసారు. సిఎం ను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునిత, బొల్లం మల్లయ్య యాదవ్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, పైల్ల శేఖర్ రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎం.సి కోటిరెడ్డి, పార్టీ నేత సోమా భరత్ కుమార్, ఉమా మాధవరెడ్డి, చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, మేడె రాజీవ్ సాగర్, ఎ. సందీప్ రెడ్డి, మందాడి సైదిరెడ్డి చాడా కిషన్ రెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి, శంకర్ తదితరులున్నారు.
Read Also: MLC Pochampally Srinivas Reddy: సరంపేటలో పూర్తి మెజారిటీ.. కేసీఆర్ అభినందనలు
తాజావార్తలు
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!