Site icon NTV Telugu

CM KCR : ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్

Kcr Speech

Kcr Speech

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లబోతున్నామని సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చేశారు. డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక ప్రజల్లోనే ఉండాలి.. పాదయాత్రలు చేయాలని, నియోజకవర్గాల వారీగా ప్రజలతో మమేకమవ్వాలని విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో ఉంటాయ‌ని, ఆ లోపు ఎన్నిక‌ల‌కు ప్లాన్ చేసుకోవాల‌ని కేసీఆర్ సూచించారు.

Also Read : Revanth Reddy : జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా రద్దు చేయాలి

నాయ‌కులంతా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆదేశించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వీలైతే పాద‌యాత్ర‌లు చేయాల‌ని చెప్పారు. వీలైన‌న్ని ఎక్కువ‌గా కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు నిర్వ‌హించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని నేతలు, పార్టీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలి. సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించండి. కచ్చితంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది.

Also Read : PAT CUMMINS : ప్యాట్ కమిన్స్ కు మాతృవియోగం.. నల్లబ్యాడ్జీలతో ఆసీస్ ప్లేయర్స్ సంతాపం

ఏప్రిల్-27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుంది’ అని సమావేశంలో నేతలకు కేసీఆర్ క్లియర్‌కట్‌గా చెప్పేశారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా.. కవిత కొంత సమయం కోరారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల 15న విచారణకు వస్తానని ఈడీకి లేఖ రాశారు. కానీ ఈ నెల 11న విచారణకు రావాలని ఈడీ కోరడంతో.. ఆ రోజు విచారణకు కవిత హాజరుకానున్నారు. శనివారం కవిత ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాలతో పాటు టీ పాలిటిక్స్‌లో నెలకొంది.

Exit mobile version