CM YS Jagan: మేలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కీలక పర్యటనలు

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: వచ్చే నెలలో కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక పర్యటనలు చేయనున్నారు.. లబ్దిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ.. బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. మే నెల 19, 22 తేదీల్లో గుడివాడ, బందర్‌లో సీఎం జగన్ కార్యక్రమాలు ఉంటాయి.. మే19న గుడివాడలో 9 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు సీఎం వైఎస్‌ జగన్ ఇవ్వనున్నారని తెలిపారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. మే 22వ తేదీన బందరు పోర్ట్ పనులను సీఎం వైఎస్‌ జగన్ ప్రారంభించనున్నారని తెలిపారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని. కాగా, వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఓవైపు నిత్యం వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోన్న ఆయన.. మరోవైపు.. జిల్లాలను కూడా చుట్టేస్తున్నారు.. ఇక, పార్టీ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక సూచనలు చేస్తున్న విషయం విదితమే.

Read Also: LSG vs PBKS: విధ్వంసం సృష్టించిన లక్నో జట్టు.. పంజాబ్‌ ముందు అతి భారీ లక్ష్యం

×
×
Ad