NTV Telugu Site icon

CM Jagan : ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన

Ap Cm Jagan

Ap Cm Jagan

విజయవాడలో ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నివాసానికి వెళ్ళనున్న సీఎం జగన్‌.. అక్కడి నుంచి ఎ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. జస్టిస్‌ మిశ్రా గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ పీకే మిశ్రా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపధ్యంలో ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం విందు సమావేశం ఏర్పాటు చేసింది.

Also Read : Thalapathy Vijay: విజయ్ రాజకీయాల్లోకి వస్తారా!?

ఇదిలా ఉంటే.. తాజాగా జగన్ మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగనన్న సురక్షలో భాగంలో.. జూలై ఫస్ట్ నుంచి విలేజ్, వార్డ్ సచివాలయాల వద్ద స్పెషల్ క్యాంప్స్ 4 వారాల పాటు కండెక్ట్ చేయనున్నారు. అక్కడ వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలతో పాటు 11 రకాల సర్వీసులు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా అందించనున్నారు. చాలా కాలంగా మొండికి పడిన పనులకు ఇక్కడ చెక్ పెట్టనున్నారు. ఏవైనా పర్సనల్ డాక్యూమెంట్స్‌కు సంబంధించి ఇబ్బందులు ఉన్నా.. సంక్షేమ పథకాల అందడంలో జాప్యం జరుగుతున్నా.. అలాంటి సమస్యలకు ఇక్కడ సొల్యూషన్ లభిస్తుంది. ఈ స్పెషల్ క్యాంపుల కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలెట్టారు.

Also Read : Uddhav Thackeray: ఠాక్రే, అంబేద్కర్ ఫోటోల పక్కన ఔరంగజేబు.. మహారాష్ట్రలో సరికొత్త వివాదం..