NTV Telugu Site icon

CM Jagan : నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Ap Cm Jagan

Ap Cm Jagan

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించి వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. తొలుత ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల మైదానంలో 10.15 గంటల నుంచి 12.05 గంటల వరకు జరిగే బహిరంగ సభలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం 12.40కి అక్కడి నుంచి బయలుదేరి 1.35కి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది.

Also Read : Telangana Congress: అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా

2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సమర్పించిన ఏపీ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నవరత్నాలు నిరంతర అభివృద్ధిపై బలమైన ప్రతిబింబాన్ని కలిగి ఉన్నాయని ఉచ్ఛరించింది. బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దార్శనికత సంక్షేమ ఎజెండాలో మెరుగైన సామాజిక భద్రత, రైతుల ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల ఆదరణకు పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి రూ.610 కోట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య, వెలమ మరియు రెడ్డి వంటి కులాల మహిళలకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తారు. 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు సంవత్సరానికి 15,000 అందిస్తారు.

Also Read : MCU: ఉమెన్ పవర్… సరికొత్త సూపర్ హీరోస్ టీమ్ అప్ అవుతున్నారు

Show comments