అమ్మలనగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు కనుల పండువగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రేపు మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకోనున్నారు సీఎం జగన్. ఇదిలా వుంటే.. ఇంద్రకీలాద్రిపై సీఎంఓ సెక్యూరిటీ ట్రయల్ రన్ నిర్వహించారు. రేపు మూలానక్షత్రం సందర్భంగా సీఎం జగన్.. దుర్గగుడికి రానుండడంతో అన్ని ఏర్పాట్లు పరిశీలించారు అధికారులు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల గొడవతో వీఐపీ గేట్లకు తాళం వేశారు కలెక్టర్ ఢిల్లీరావు…ఉభయ దాతలు,ప్రత్యేక పూజల దర్శనాల వారిని దగ్గరుండి లోపలకు పంపారు….ఎవరైనా టికెట్ తీసుకునే లోపలికి రావాలని ఆదేశాలు జారీ చేసారు. ఆరురోజులుగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు కలెక్టర్ ఢిల్లీ రావు. మూలా నక్షత్రం రోజు 3 లక్షల మంది భక్తులు రావచ్చు.. అర్దరాత్రి 1.30 నుండి దర్శనానికి అనుమతి వుంటుందన్నారు. రేపు వీఐపీ, వీవీఐపీ రికమండేషన్స్ ఉండవన్నారు.
Read Also: Womens Asia Cup: రప్ఫాడించిన రోడ్రిగ్స్.. లంకపై భారత్ ఘనవిజయం
ఏ వాహనాలు కొండ మీదకు అనుమతి లేదు.. రేపు అన్ని క్యూలైన్స్ ఫ్రీ దర్శనాలే..సీఎం రేపు మధ్యాహ్నం 3 గం.లకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు కలెక్టర్ ఢిల్లీ రావు. సీపీ కాంతిరానా టాటా మాట్లాడుతూ…రేపు మూలానక్షత్రం సందర్భంగా రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు రావచ్చు.. ఈ అర్దరాత్రి 12 గం.ల నుండే క్యూలైన్స్ దగ్గర బందోబస్తు ఉంటుంది..భారీగావస్తున్నారు కాబట్టి హోల్డింగ్ ఏరియా పాయింట్ VMC దగ్గర ఉంచుతున్నాం అన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి ట్రాఫిక్ డైవర్షన్ , కుమ్మరి పాలెం నుండి ట్రాఫిక్ డ్రైవర్షన్ ఉంటుందని సీపీ తెలిపారు. రేపు ఇంద్రకీలాద్రి దగ్గర 5 వేలమంది పోలీసులు బందోబస్తు ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే.. ఇంద్రకీలాద్రిపై ఒకవైపు భక్తుల రద్దీ భారీగా వుంది. మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బంధువులతో కలిసి భారీగా ఆలయానికి చేరుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ఐదు వాహనాలతో వెల్లంపల్లి శ్రీనివాస్ కొండపైకి వచ్చారు. అది చాలదన్నట్టుగా ఈరోజు ఆరు వాహనాలతో కొండమీదికి వచ్చారు ఎమ్మెల్యే. రద్దీ సమయంలో భారీ బంధు గణంతో ఆలయానికి చేరుకున్న వెల్లంపల్లి తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
Read Also: Botsa Satyanarayana: వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం
