NTV Telugu Site icon

CM YS Jagan: భావితరాల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం..

Jagan

Jagan

CM YS Jagan: ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం దద్దరిల్లింది. ప్రొద్దుటూరులో ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తుంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంతటి మహా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జెండా తల ఎత్తుకుని రెపరెపలాడుతుందన్నారు. ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా మార్పు తీసుకుని వచ్చామన్నారు. భావితరాల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందించామన్నారు. రాష్ట్రంలో కోట్ల గుండెలు వైసీపీకి మద్దతు పలుకుతూ2024 ఎన్నికలకు సిద్ధం అంటున్నాయన్నారు. వైసీపీ జెండా ఏ జెండాతో జతకట్టడం లేదని.. ప్రజలే మన అజెండా అంటూ సీఎం పేర్కొన్నారు. ప్రొద్దుటూరు సభ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుందన్నారు.

Read Also: BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల

మీరంతా సిద్ధమా?..
పేదల అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్న దుష్ట చతుష్టయాన్ని పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమా అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ అర్జునుడు సిద్ధంగా ఉన్నాడని తనను ఉద్దేశించి సీఎం తెలిపారు. మే13న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. అభివృద్ధి నిరోధకులను ఓడించడానికి మీరంతా సిద్ధమా అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంకు చంద్రబాబు వదిన చుట్టం… డ్రై ఈస్టు పేరుతో డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. క్షణాల్లో మనపై నిందలు మోపారన్నారు. సాక్షాత్తు బీజేపీ చీఫ్ బంధువులు, బాబు బంధువులు, స్నేహితులే అందులో డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. ఎక్కడ నేరం జరిగిన అది మనపై మోపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిందలు మోపుతున్నారు..
ఒక చంద్రబాబు, ఒక దత్త దత్తపుత్రుడు నిందలు మోపడానికి సిద్ధంగా ఉంటారన్నారు. దొరికిన వారంతా టీడీపీ వారు.. దొరకని వారు వైసీపీ వాళ్ళు అవుతారన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి బతికి ఉంటే శత్రువు.. చనిపోయినాక శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరికి ఉన్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో ప్రజలకు గమనించాలన్నారు. కేంద్రం నుంచి పరోక్షంగా మరో పార్టీని తెచ్చుకొని ఒక్క జగన్ మీద యుద్ధం చేస్తున్నారన్నారు. ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్ వీరంతా కాదని తన చెల్లిని కూడా తెచ్చుకొని యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్‌ అన్నారు.

Read Also: Justice Chelameswar: వ్యక్తిగత స్వలాభం.. వ్యవస్థలకు చేటు తెస్తుంది..

ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేదు..
తన ఒక్కడి పైకి ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. ప్రజలు అండగా ఉన్నారన్నది సత్యం అన్నారు. బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో ఎక్కడ ఉంటుందో గమనించాలన్నారు. ఎన్నికల అయిపోయినాక చంద్రబాబు మేనిఫెస్టో ఎక్కడ ఉందనివి ఎంత వెతికినా కనపడదన్నారు. ఎన్నికలు అయిపోయినాక చంద్రబాబును కొడతారనే భయమని.. గత ఎన్నికల్లో తిట్టిన పార్టీని కూడా రాబోయే ఎన్నికల్లో కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశ్వసనీయత, విలువలు లేని రాజకీయం వీళ్లే చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో చెరగని పరిపాలనను మీ బిడ్డ అందించారన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా ఏ పట్టణాన్ని తీసుకొని పరిశీలించుకోవచ్చన్నారు. గ్రామాల్లో గ్రామ సచివాలయం, పట్టణాల్లో పట్టణ సచివాలయం కనిపిస్తుందన్నారు. 58 నెలల కాలంలో అభివృద్ధిని చేపట్టామన్నారు. ఒకటవ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చి కలుకుతట్టి చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ ఇచ్చిన ఘనత వైసీపీదేనని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

పెద్దపీట వేసింది వైసీపీనే..
సంవత్సరానికి 24 వేల కోట్ల రూపాయలు అవ్వతాతల కోసం వైసీపీ ఖర్చు చేస్తుందని సీఎం జగన్‌ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఖర్చు చేస్తూ ఉండేది కేవలం 12 వేల కోట్లేనని ఆయన చెప్పారు. లంచాలు, వివక్షతకు మారుపేరైన జన్మభూమి కమిటీలు రద్దుచేసి, స్వచ్ఛమైన వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టింది మీ బిడ్డేనని ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ వెల్లడించారు. 2లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాలకు వెళ్లిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈతో మొదలు పెడితే ఐబీ దాకా ప్రయాణం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చేతుల్లో ట్యాబులు ఉన్నాయన్నారు. రైతన్నకు పంట వేసే సమయానికి రైతు భరోసా సహాయాన్ని అందిస్తోంది వైసీపీ యేనని అన్నారు. 22ఏ భూముల మీద రైతన్నలకు శాశ్వత భూహక్కు కల్పించామన్నారు. దాదాపు 33 లక్షల ఎకరాల భూమిని రైతులకు శాశ్వత హక్కులు కల్పించామన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది వైసీపీనే అని సీఎం జగన్‌ తెలిపారు.