ముఖ్యమంత్రి జగన్ నేడు పోర్టులు, హార్బర్లపై సమీక్ష చేయనున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యాసంస్థలో మెరుగైన ప్రమాణాలను పాటించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని , అందుకోసం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్సీని విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం జగన్.. విద్యాశాఖ ఆదేశించారు. ఆర్బీకేలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ పనులు, కార్యక్రమాల పై అధ్యయనం జరగాలని అధికారులకు తెలిపారు.
Also Read : IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి టీ20.. శాంసన్ స్థానంలో సిక్సర్ల కింగ్! భారత తుది జట్టు ఇదే
ప్రైమరీ, సెకండరీ పుడ్ ప్రాసెసింగ్ వ్యవస్ధలు డీసీఎంఎస్‌ల ద్వారా ఇంటిగ్రేడ్ కావాలని పేర్కొన్నారు. వీటన్నింటి మీద సమూల అధ్యయనం చేసి చర్యల కోసం తగిన నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను కోరారు. అయితే.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందించటం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్ ఫాం ఈడీఎక్స్ తో ఏపీ ఉన్నత విద్యా శాఖ ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఎమ్ఓయూ చేసుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్ఓయూ జరుగనుంది. ప్రముఖ విద్యాసంస్థలు హార్వర్డ్, ఎమ్ఐటీ ల ఉమ్మడి ప్లాట్‌ఫాం ఈడీఎక్స్.
Also Read : ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్‌లో అగ్రస్థానంలో ఈ రాష్ట్రాలు.. మొత్తంలో సగం వాటా వీటిదే