Site icon NTV Telugu

CM Jagan : స్పందనపై సీఎం జగన్ సమీక్ష

Ys Jagan

Ys Jagan

స్పందన కార్యక్రమంపై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో ప్రస్తుతం ప్రజల నుంచి వివిధ అంశాలపై అందుతున్న ఫిర్యాదుల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజల సమస్యలు తీరుతున్నట్లు మొదట్లో భావించిన ప్రభుత్వం, సీఎం జగన్ కు తాజాగా అందిన ఫీడ్ బ్యాక్ వేరేలా ఉంది.

Also Read : Russia-Ukraine War: పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్ నగరం.. తెల్లవారుజామునే రష్యా భీకర దాడులు

దీంతో వినతుల పరిష్కారంలో మరింత మెరుగైన వ్యవస్థ ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో స్పందనకు మెరుగైన రూపం ఇస్తూ మరో కొత్త కార్యక్రమం రూపొందించందుకు అధికారులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. సీఎంఓ, ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అయితే.. ఇవాళ నిర్వహించే సమీక్షలో స్పందన కార్యక్రమంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Today Business Headlines 28-04-23: చేతులు మారనున్న కామసూత్ర. మరిన్ని వార్తలు

Exit mobile version