NTV Telugu Site icon

CM Jagan : ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం.. 658.60 కోట్లు జమ

Cm Jagan

Cm Jagan

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈబీసీ నేస్తం ద్వారా అక్క, చెల్లెళ్ళకు లబ్ది చేకూర్చే కార్యక్రమమన్నారు. అక్క,చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని, 4,39,068 మంది అక్క,చెల్లెళ్ళకు 658.60 కోట్ల సాయం అందిస్తున్నామన్నారు. పుట్టిన బిడ్డ మొదలు వృద్ధురాలి వరకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారని, ప్రతీ మహిళను వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

Also Read : PVN Madhav : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

అంతేకాకుండా.. ‘చిరునవ్వులతో కుటుంబాన్ని నడిపిస్తున్న అక్కా,చెల్లెమ్మలు.. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం.. రెండేళ్ల కాలంలో పేద అక్కా,చెల్లెమ్మకు వారి ఖాతాల్లోకి నగదు జమ చేశాం.. దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయటం లేదు.. అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజలకు అనేక పథకాలు.. పేదరికానికి చికిత్స చేయాలని తాపత్రయంతోనే పనిచేస్తున్నాం.. బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు.. ఇప్పటి వరకు 46 నెలల కాలంలో 2.07 లక్షల కోట్ల నగదు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశాం.. బ్యాంకులకు నగదు కట్టలేక ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఆసరా పథకం ద్వారా లబ్ది.. వైఎస్సార్ జగనన్న కాలనీల ద్వారా 30 లక్షల మందికి ఇల్లు.. ప్రతీ మహిళ మొబైల్ లోకి దిశ యాప్ డౌన్ లోడ్ చేయించాం.. ఏపీని ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాల్లో పథకాలు.. మహిళలు ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి..’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Vande started India: వందే భారత్ ను ఎన్నిసార్లు ప్రారంభించారంటే?