CM Jagan: చుక్కల భూముల రైతులకు సర్వహక్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తరతరాల సమస్యలకు పరిష్కారం చూపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుక్కల భూముల రైతులకు ఊరట కలిగేలా చేశారు. లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించాం అని తెలిపారు సీఎం జగన్. రిజిస్ట్రేషన్ లోని 22(a) నుంచి చుక్కల భూములను తొలగించాం.రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన ప్రభుత్వం మనది. రైతున్నలకు మేలు చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.
ఈ భూముల రిజిస్ట్రేషన్ రూ.8 వేల కోట్లు, మార్కెట్ విలువ రూ 20 వేల కోట్లు ఉంటుంది.97 ,412 వేల మంది రైతులకు 2లక్షల 6 వేల ఎకరాలకు హక్కులు కల్పిస్తున్నాం.బ్రిటిష్ హయాంలో రీసర్వే సెటిల్ మెంట్ రికార్డ్ లో చుక్కలు పెట్టి వదిలేశారు.దీంతో తర తరాలుగా రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి ఏర్పడింది. 2016 లో గత టిడిపి ప్రభుత్వం రైతన్నలకు మేలు చేయకుండా పుండు మీదకారం చల్లినట్లు నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ రోజు చుక్కల భూముల సమస్యలపై ప్రజలు పడిన కష్టాలు నేను పాదయాత్రలో చూశాను.కాళ్ళు అరిగేలా తిరిగినా..జరగని ఈ చుక్కల భూముల సమస్య ను నేను చూశాను, నేను విన్నాను, 43వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో., 37 వేల ఎకరాలు ప్రకాశంలో 22 వేల ఎకరాలు కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లా లలోని రైతులకు న్యాయం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తం గా రెండు లక్షలు ఎకరాల కు రైతులకు పూర్తి హక్కు కల్పిస్తున్నాం అన్నారు జగన్.
Also Read
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- Vaibhav: ఒక్కో రన్‌కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
Read Also: Suriya: కదన రంగంలో ‘కంగువ’.. యుద్ధ వీరుడు ఇలా ఉండాలి!
దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలుగుతుంది. దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలగనున్నాయి. వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ లేదా ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్ రిజిస్టర్ – ఆర్ఎస్ఆర్) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. అవే చుక్కల భూములు. వీటిని రైతులు అనుభవిస్తున్నా, సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం వీరి కష్టాలను మరింత సంక్లిష్టం చేస్తూ అనాలోచితంగా ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములపై రైతులకే సంపూర్ణ హక్కులు ఉండాలని నిర్ణయించారు.
రైతులు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ఈ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. జిల్లా కలెక్టర్ల ద్వారా చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫై చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములపై రైతులకు సర్వ హక్కులు లభించాయి. ఈభూములను అమ్ముకొనేందుకు, రుణాలు పొందడానికి, తనఖాకు, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కలిగింది. వీటిపై రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1902 సంప్రదించవచ్చు.
Read Also:Pakistan: ఇమ్రాన్‌కు గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్ ఇచ్చారు.. లాయర్ల ఆరోపణలు
తాజావార్తలు
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
-
Vaibhav: ఒక్కో రన్‌కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..