ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన, పార్టీ వ్యవహారాలు, మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల అంశంలో విశాఖకు పాలనా రాజధాని అంశం పై స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. ఇవాళ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో విశాఖకు వెళ్ళనున్నట్లు ప్రకటించిన సీఎం జగన్.. అప్పటికి అందరూ సిద్దం కావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. సమావేశాల్లో మంత్రుల పని తీరు మెరుగ్గా ఉండాలని సూచించారు. మీ శాఖలకు సంబంధించి కూలంకషంగా అధ్యయనం చేసి సమాధానాలు ఇవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాలపై కూడా సీఎం సూచనలు చేశారు.
Read Also:Alleti Maheshwar reddy: మీరే ఇలా చేస్తే ఎలా? మాణిక్‌రావ్ ఠాక్రేకు మహేశ్వర్ రెడ్డి లేఖ..
కొందరు మంత్రుల పనితీరుపై సీఎం జగన్ అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. మంత్రులు మారకపోతే ఒకరిద్దరిని తప్పించటానికీ వెనుకాడను అని సూచన ప్రాయంగా తెలిపారు. టీడీపీ చేసే విమర్శలకు దూకుడుగా సమాధానాలు ఇవ్వాలన్నారు. మొత్తం మీద విశాఖను పాలనా రాజధానిగా చేయడంతో పాటు అక్కడినుంచి తమ పాలన బాధ్యతలను నిర్వహించడానికి జగన్ నిర్ణయించుకున్నారు. రాబోయే కాలం చాలా కీలకం అనీ, మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు జగన్. సరిగా పనిచేయని మంత్రులకు జగన్ ఒక అవకాశం ఇచ్చారని, పనితీరు మార్చుకోకపోతే వారిపై వేటు పడుతుందనే సంకేతాలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈనెల 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామన్నారు చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఈనెల 16వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. 22వ తేదీ ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఉంటుందన్నారు. సంక్షేమ, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెడతామని చీఫ్ విప్ ప్రసాదరాజు తెలిపారు.
Read Also: Adani Son Engagement: గౌతమ్ అదానీ కొడుకు ఎంగేజ్మెంట్.. వధువు ఎవరంటే..