Site icon NTV Telugu

CM Jagan : నేడు విద్యా శాఖ పై సీఎం జగన్ సమీక్ష

Ap Cm Jagan

Ap Cm Jagan

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో స్కూల్స్‌ ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నాడు-నేడు పనుల పురోగతి, విద్యాకానుక, అమ్మ ఒడి అమలుపై చర్చించనున్నారు సీఎం జగన్‌. ఉదయం 11 గంటలకు తాడేపల్లి కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే.. గత నాలుగు రోజుల క్రితం.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Also Read : Telangana Rains: వాతావరణశాఖ కీలక అప్టేట్.. నేటి నుంచి వచ్చే మూడ్రోజులు వర్షాలే

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహించిన సమీక్షలో.. వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి గోవర్థన్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయం, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కెవీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సమీక్షలో పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల బలోపేతంపై చర్చించారు. వాటి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం దిశగా సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, రైతు భరోసా కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేశామన్నారు. ఆర్బీకేలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్‌ పనులు, కార్యక్రమాల పై అధ్యయనం జరగాలని అధికారులకు తెలిపారు. ప్రైమరీ, సెకండరీ పుడ్‌ ప్రాసెసింగ్‌ వ్యవస్ధలు డీసీఎంఎస్‌ల ద్వారా ఇంటిగ్రేడ్‌ కావాలని పేర్కొన్నారు. వీటన్నింటి మీద సమూల అధ్యయనం చేసి చర్యల కోసం తగిన నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను కోరారు.

Also Read : Women Health: డెలివరీ తరువాత స్త్రీలు డిప్రెషన్‌కు ఎందుకు గురవుతారో తెలుసా?

Exit mobile version