Site icon NTV Telugu

CM Jagan : మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు

Jagan

Jagan

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి నేడు. అయితే.. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు.’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

Also Read : IND vs WI: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. బాహుబలి రీఎంట్రీ!

అయితే.. ఇడుపుల పాయలో వైఎస్సార్‌ ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఇదిలాఉంటే, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఘాట్ వద్ద వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించనున్నారు.

Also Read : Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఇంధన సంక్షోభం.. అన్నీ మూసుకు కూర్చుంది..

Exit mobile version