Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Jagan Distributes Amma Vodi Funds

CM YS Jagan: నాలుగేళ్లలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తెచ్చాం..

Published Date :June 28, 2023 , 12:56 pm
By Sudhakar Ravula
CM YS Jagan: నాలుగేళ్లలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తెచ్చాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కురుపాంలో నాలుగో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇరవై ఆరువేల కోట్లు ఇప్పటి వరకు ఈ పథకానికి ఇవ్వడం జరిగింది అని వెల్లడించారు.. ఇదంతా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు నేరుగా అందింది.. పిల్లల భవిష్యత్తు కోసం.. బడికి పిల్లలను పంపించేందుకు ఆ తల్లులకు ఇచ్చే ప్రోత్సాహకం ఇది… దేశంలో మరెక్కడా జరగటం లేదు… ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది అన్నారు.. నాలుగేళ్లలో రాష్ట్రంలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని వెల్లడించారు.. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తాం అని తెలిపారు.

ఇక, నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ తన ప్రసంగం ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌. తల్లులు తమ పిల్లలను బడులకు పంపేందుకు అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో.. క్లాస్‌ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో చూశాం. ఇప్పుడు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు ఉండేలా చేస్తున్నాం. మన పిల్లలు గ్లోబల్‌ సిటిజన్స్‌గా తయారు కావాలి అని సీఎం జగన్‌ వేదిక నుంచి ఆకాంక్షించారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ కరికులమ్‌ తీసుకొస్తున్నాం. ఆరో తరగతి నుంచే క్లాస్‌ను డిజిటలైజ్‌ చేస్తున్నాం అని తెలిపారాయన. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం, విద్యాకానుక కిట్లు అందించడం, మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు.. టోపేన్ కోసం మూడు నుంచే ప్రత్యేక తరగతులు ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు చేశాం అన్నారు.

గతంలో పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు .. ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు సీఎం జగన్‌.. పెత్తందారీ విద్యావిధానాన్ని బద్ధలు కొట్టి.. అన్నివర్గాలకు ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడులని తీర్చిదిద్దాం. ప్రైవేట్‌ బడులతో ప్రభుత్వ బడులు పోటీపడే పరిస్థితికి చేరుకుంది. చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం. ప్రభుత్వ బడుల్లోనూ వజ్రాలు, రత్నాల్లాంటి పిల్లలు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అని పేర్కొన్నారు.. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. అంగన్వాడీలలో గర్భిణీ లకు సంపూర్ణ పౌష్టికాహార అందిస్తున్నాం.. 45 వేల ప్రభుత్వ స్కూలలో నాడు నేడు ద్వారా మార్పులు చేస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య అందిస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ ట్యాబ్ లను అందిస్తున్నాం.. వందశాతం ఫీజురీయంబర్సమెంట్ అందిస్తుంది ఈ మన ప్రభుత్వం అన్నారు.

హాస్టల్, మెస్ ఖర్చుల కోసం వసతి దీవెన కార్యక్రమం పెద్ద చదువులు చదివిన వారికి అందిస్తున్నాం అని గుర్తుచేశారు సీఎం జగన్‌.. సత్యానాదెండ్ల మాదిరిగా ప్రతి ఇంటి నుంచి రావాలని ఆకాంక్షిస్తున్నాను.. పెద్ద పెద్ద యూనివర్సిటీ లలో సీటు వస్తే చాలు చదివించడానకి మీ మేనమామ ఉన్నాడు అని స్పష్టం చేశారు.. నాలుగు సంవత్సరాల కాలంలో సంస్కరణలు కోసం అరవై అరువేల ఏడు వందల వేల కోట్లు ఖర్చు చేశామన్న ఆయన.. గత ప్రభుత్వం చివరి విద్యా సంవత్సరంలో గ్రాస్ ఎన్రోర్మెంట్ రేసియో లో మన రాష్ట్రం అట్టడుగున ఉంటే.. ఇప్పుడు 100.08 శాతానికి చేరుకున్నాం అన్నారు. రాబోయే నెలలో ట్రైబుల్ యూనివర్సిటీ కి శంకుస్థాపన చేసుకోబోతున్నాం.. గాంధీ గారు మూడు కోతుల కథ అందరికీ తెలుసు.. ఇవి చెప్పే నీతి చెడు వినకు చూడకూ మాట్లాడకు అని చెబుతాయి. మన రాష్ట్రంలో మాత్రం నాలుగు కోతులు ఉన్నాయి.. మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచు చేయకన్నది వీరి నీతి అంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amma Vodi Funds
  • Andhra Pradesh
  • cm jagan
  • CM YS Jagan

తాజావార్తలు

  • Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rowdy-Sheeters: హైదరాబాద్‌ పోలీసుల కీలక ఆపరేషన్‌.. 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు

  • Vaazha 2 : బడ్జెట్ రూ. 10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 100 కోట్లు మలయాళంలో సెకండ్ హిట్ అందుకున్న సాహు గారపాటి

  • Digital Arrest Scam: ఫ్యామిలీ మొత్తం 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. తన ఐడియాతో చెక్‌ పెట్టిన 8వ తరగతి విద్యార్థి.. ఖంగుతిన్న కేటుగాళ్లు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions