NTV Telugu Site icon

CM Jagan : ఆర్ 5 జోన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెల 24న లబ్దిదారులకు ఇంటి నిర్మాణాల అనుమతి పత్రాలు

Ap Cm Jagan

Ap Cm Jagan

అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు కూడా ఇళ్లు కేటాయించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కొత్తగా ఆర్-5 జోన్ ను సృష్టించడం తెలిసిందే. దీన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై హైకోర్టులో నిన్న వాదనలు పూర్తయ్యాయి. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది. అయితే.. ఈ నేపథ్యంలో.. అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ళ నిర్మాణాల కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల 24న లబ్దిదారులకు ఇంటి నిర్మాణాల అనుమతి పత్రాలు ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా వెంకటాయ పాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన బహిరంగ సభ నిర్వహించారు. ఆర్ 5 జోన్‌లో 47 వేల మంది పేదల ఇంటి నిర్మాణం.. 47 వేల మందికి అదే రోజు అనుమతి పత్రాలు అందజేయనున్నారు సీఎం జగన్‌. అయితే.. మరోవైపు ఆర్ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణాలను వ్యతిరేకిస్తోంది టీడీపీ.

Also Read : Second PRC: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త.. త్వరలోనే సెకండ్ పీఆర్సీ అమలుకు కసరత్తు

సచివాలయాల వారీగా కౌంటర్ల ఏర్పాటు చేయనున్నారు.. అయితే.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణాల పనులు వేగంగా సాగుతున్నాయి. కృష్ణాయపాలెం లే అవుట్ లో ముమ్మరంగా పనులు చేపట్టారు అధికారులు. ఈ నెల 24న కృష్ణాయ పాలెం లే అవుట్ కు సీఎం జగన్ రానున్నారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్ లో కృష్ణాయపాలెం చేరుకోనున్న సీఎం.. పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం జగనన్న కాలనీలోని ఒక మోడల్ హౌస్ ను సందర్శించనున్న సీఎం.. షియర్‌వాల్ టెక్నాలజీతో కేవలం మూడు రోజుల్లోనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.. మూడు షిఫ్టుల్లో ఇంటి నిర్మాణాల సిబ్బంది పని చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆర్ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

Also Read : Bro: పవన్ ఆర్మీ గెట్ రెడీ… సోషల్ మీడియాకి రెడ్ అలర్ట్…