ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఓ యువకుడు ఏకంగా రూ.22 వేల కోట్లను దోచేశాడు. విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించి.. రెండు రాష్ట్రాలకు చెందిన వందల మందికి టోకరా వేశాడు. అస్సాంకు చెందిన 22 ఏళ్ల విశాల్ పుకాన్ అనే యువకుడ్ని వేల కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణపై ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దిబ్రూఘర్‌కు చెందిన పుకాన్ తన లగ్జరీ లైఫ్‌స్టైల్, హై ఫ్రొఫైల్‌తో అసోం, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పలువుర్ని స్టాక్ మార్కెట్ పేరుతో ఆకర్షించి.. భారీ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
READ MORE: Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ భారీ వరద
ఈ సైబర్ ఫ్రాడ్ కేసులపై సీరియస్‌గా ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. స్పందించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించని పెట్టుబడి బ్రోకర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అస్సాం ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అనేక నకిలీ వ్యాపార సంస్థలు పనిచేస్తున్నాయని అనేక మీడియా నివేదికలు చెబుతున్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సంస్థలు సెబీ, ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించడం లేదు.
READ MORE:Kolkata doctor case: వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ అప్‌డేట్ ఇదే!
చాలా మంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారని.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలు డబ్బు పెట్టుబడి పెట్టే వ్యవస్థ లేదన్నారు. ఈ సైబర్ దుండగులు ప్రజలను మోసం చేశారని.. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారని పేర్కొన్నారు. “సైబర్ మోసగాళ్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను అని ఆయన అన్నారు. రాష్ట్రంలో నడుస్తున్న మొత్తం రాకెట్‌ను బయటపెడతామని స్పష్టం చేశారు. పెట్టుబడి నెట్‌వర్క్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగళూరుకు చెందిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు.