NTV Telugu Site icon

CM Chandrababu: రెండో రోజు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన..

Chandrababu Naidu

Chandrababu Naidu

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. మంగళవారం హంద్రీనీవా కాలువ పరిశీలించారు.. అనంతరం.. ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుప్పంపై వరాల జల్లు కురిపించారు. కుప్పంలో ఔటర్‌ రింగ్ రోడ్డు వేస్తాం.. అన్ని రోడ్డు అభివృద్ధి చేస్తాం అన్నారు. కుప్పం మున్సిపాలిటీకి వందకోట్ల పైనే ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా.. కుప్పంలో నాలుగు మండలాలను పదికోట్ల లెక్కన ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కుప్పం అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభిస్తాం.. అంతేకాకుండా.. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. పచ్చదనానికి కేరాఫ్ గా కుప్పాన్ని మారుస్తాను అని ప్రకటించారు.

Read Also: Buddy Movie : “బడ్డీ” రీమేక్ కానేకాదు.. అల్లు శిరీష్..

ఇదిలా ఉంటే.. రెండో రోజు షెడ్యూల్లో భాగంగా.. కుప్పం ఆర్ అండ్ బి అతిధి గృహము నందు ఉదయం10.30 గంటలకు ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం.. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియం నందు పార్టీ శ్రేణులతో సమావేశం చేపట్టనున్నారు. ఆ తర్వాత.. 4.10 గం.లకు అక్కడే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి బెంగళూరు పయనం కానున్నారు. ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్నారు. సీఎం పర్యటనకు ఉండే సెక్యూరిటీకి పూర్తి భిన్నంగా.. చంద్రబాబు టూర్ సాగుతోంది. పోలీసులు, ప్రత్యేక సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.

Read Also: Canada: ట్రూడోకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక స్థానంలో పార్టీ ఓటమి..