NTV Telugu Site icon

CM Chandrababu: పోర్టుల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu

Chandrababu

CM Chandrababu: రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్దతుల్లో చేపట్టిందని చంద్రబాబు అన్నారు.పోర్టులను నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని ఆయన పేర్కొన్నారు. కానీ పోర్టుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపలేం.. కాంట్రాక్టర్లను తప్పించేసి పనులు ఆపేయడం ఈ ప్రభుత్వ విధానం కాదన్నారు. ఏపీలో ఈవీ వెహికల్స్‌ను ప్రొత్సహించాలని ఏపీ సీఎం సూచించారు. ఈవీ వాహనాలకు ఛార్జింగ్ కోసం పెద్ద ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై ప్రణాళికలను సీఎంకు సబ్మిట్ చేస్తానని విజయానంద్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకేం సబ్మిట్ చేయనక్కర్లేదని.. ఆచరణలో పెట్టాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. క్లాస్‌ తీసుకున్న సీఎం చంద్రబాబు..

Show comments