CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్నారు.. ఇక, చంద్రబాబు సచివాలయానికి రావడానికంటే ముందుగా సీఎం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరుంచారు ముద్దాడ. మరోవైపు.. సాయంత్రం 4:41 గంటలకు సీఎంగా తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు.. తొలి రోజు ఐదు సంతకాలు చేస్తారని తెలుస్తోంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై చేయనున్నారు.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై రెండో సంతకం.. ఫించన్లు రూ. 4 వేలు చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం.. స్కిల్ సెన్సస్, అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభంపై సంతకాలు చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక, చంద్రబాబు రాక సందర్భంగా.. మానవహారంగా నిలబడి.. సెక్రటేరీయేట్ వరకు చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు అమరావతి రైతులు. పూలు చల్లుతూ ఏపీ సీఎంను స్వాగతించేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు.. మరోవైపు.. సచివాలయంలో చంద్రబాబుకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకనున్నారు ఉద్యోగులు.
Read Also: Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు
