Site icon NTV Telugu

CM Chandrababu: నేడు టీడీపీ ఆఫీస్‌కి చంద్రబాబు.. ప్రభుత్వం-పార్టీ మధ్య గ్యాప్‌ లేకుండా కొత్త ప్లాన్..!

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించారు.. ఆ బాధ్యతలను స్వీకరించే పనిలో మంత్రులు ఉండగా.. అధికారులతో వివిధ అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు పార్టీపై కూడా ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతున్నారు.. అందులో భాగంగా.. ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి.. ఇకపై తరుచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోనున్నారట ఏపీ సీఎం.. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించనున్నారని తెలుస్తోంది.. ప్రభుత్వానికి-పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు రెడీ చేస్తున్నారట.. పార్టీ-ప్రభుత్వం సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, కార్యాక్రమాలపై బయటకు వెళ్లినప్పుడు మినహాయిస్తే.. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.. ఇదే విధంగా మంత్రులు కూడా సచివాలయానికి రావాలని.. శాఖపై పట్టు సాధించాలని తనను కలిసిన మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది.

Read Also: India Forex Reserve : రెండు వారాల్లో దేశ ఖజానాలోకి రూ.76 వేల కోట్లు.. ఇదో నయా రికార్డు

Exit mobile version