Site icon NTV Telugu

CM Chandrababu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు!

Cm Chandrababu

Cm Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీ మహానాడు బహిరంగ సభ తర్వాత కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరిగే సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేపు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య ఈ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను బాబు కలిసే అవకాశముంది. యోగా దినోత్సవంకు ఆహ్వానం అందించడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుతున్న బంగారం ధరలు!

శనివారం ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్‌ పోర్ట్‌కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం గునేపల్లిలో ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావటంతో ఒక రోజు ముందే ఫించన్లు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. గున్నేపల్లి గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం నియోజకవర్గ పార్టీ నేతలతో సీఎం సమావేశమవుతారు. ఇక శనివారం సాయంత్రం అమరావతి చేరుకుంటారు.

Exit mobile version