రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలన్నారు. ఎప్పుడైనా మామిడిని రైతుల వద్ద నుండి వైసీపీ కొనిందా?, గిట్టుబాటు ధర ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రెండు సార్లు తమ ప్రభుత్వమే మామిడికి గిట్టుబాటు ధర ఇచ్చింది అని చెప్పారు. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండవ రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సమస్యలపై మీడియాతో మాట్లాడారు.
‘రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం మాది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చింది. ఏ పంట పండిస్తే లాభదాయకమో ఆలోచిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌పై చర్చిస్తున్నాం. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలి. ఆధునిక పద్దతులతో వ్యవసాయంలో లాభాలు పెరుగుతాయి. పంటలకు ప్రాధాన్యత ఇస్తూ గిట్టుబాటు వచ్చేలా మేం చేస్తున్నాం. రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు కూడా వెళ్లాం. ఒక్కోసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. అనేక ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రెండో విడత నగదు విడుదలకు డేట్ ఫిక్స్.. వారికి కూడా!
‘మామిడి ఎగుమతికి అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందులు వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా మామిడి దిగుబడి వచ్చింది. ఎప్పుడైనా మామిడిని రైతుల వద్ద నుండి వైసీపీ కొనిందా?, గిట్టుబాటు ధర ఇచ్చిందా?. రెండుసార్లు మన ప్రభుత్వమే మామిడికి గిట్టుబాటు ధర ఇచ్చింది. తమిళనాడు, కర్నాటక నుండి జిల్లాలోకి మామిడి రైతులను రాకుండా చూశాం. ఈమద్య కాలంలో దిగుబడి బాగా పెరిగింది. రైతులు అర్దం చేసుకోవాలి. జిల్లా రైతులకు ఎప్పుడైనా వైసీపీ నేతలు ఒక్కరూపాయి ఇచ్చారా?, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా?. మేం మైక్రో ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
