NTV Telugu Site icon

CM Chandrababu: తిరుమలలో జరిగిన అపచారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్

Chandrababu

Chandrababu

CM Chandrababu: తిరుమలలో జరిగిన అపచారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొ్న్నారు. అపచారం ఎవరి వల్ల జరిగింది..? ఎందుకు జరిగిందనే అంశంపై విచారణ చేసి సిట్ నివేదిక ఇస్తుందన్నారు. టీటీడీలో జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా రేపు హోమం చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో.అక్కడి సంప్రదాయం ప్రకారం శుద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also: AP CM Chandrababu: లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆలయ పరిపాలన, ఆగమ పండితులతో కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆక్కడి సంప్రదాయాలను.. ఆగమాలను గౌరవించేలా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. ఇకపై అన్య మతస్తులు ఆయా ప్రార్థన మందిరాల్లో ఉండకుండా చర్యలు చేపడతామన్నారు. హిందూ మతంలోనే కాదు.. అన్ని మతాల్లోనూ ఇదే విధానాన్ని అవలంభిస్తామన్నారు. అవసరమైతే చట్టం చేస్తామన్నారు. భగవంతునికి అపచారం జరగకుండా ఆపలేకపోయామని భగంవతునికి క్షమాపణ చెప్పాలన్నారు. అపచారం చేసిన వాళ్ల సంగతి భగంవతుడూ చూస్తాడన్నారు.