CM Chandrababu: మద్యం కుంభకోణం.. సభలో సీఎం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్
- గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది..
- మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు..
- ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు..
- పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారు..
- అసెంబ్లీలో గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేరస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత ఐదేళ్లల్లో చూశామన్న ఆయన.. మద్య నిషేధం అని హామీ ఇచ్చారు.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు. వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్ల నేరాలు పెరిగాయని విమర్శించారు. గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు.. కానీ, ఏదేదో బ్రాండ్లు తెచ్చారని మా వాళ్లు కొందరు చెబుతున్నారన్నారు.
Read Also: Home Minister Anitha: వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకే పరిమితమైంది..
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
ఇక, MNC బ్రాండ్లకు చెల్లింపులు పెండింగులో పెట్టి.. వేరే బ్రాండ్లను మార్కెట్టులోకి తెచ్చారు. మద్యం దుకాణాల్లో మొత్తం నగదు లావాదేవీలే ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు.. మద్యం అమ్మకాల ఇల్లీగల్ కలెక్షన్ ద్వారానే మొత్తంగా రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని విమర్శించారు.. లక్ష కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ. 630 కోట్లు మాత్రమే డిజిటల్ అమ్మకాలు జరిగాయి. నాసిరకం మద్యం ద్వారా కిడ్ని వ్యాధులు 54 శాతం, లివర్ వ్యాధులు 52 శాతం పెరిగాయి. మద్యపాన నిషేధం అన్నారు.. మద్యం ఆదాయం తాకట్టు పెట్టారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద మద్యం కుంభకోణం మరెక్కడా జరగలేదన్నారు.. ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన చేయాలి. పారదర్శకతతో కూడిన ఎక్సైజ్ పాలసీ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!